Trending Now

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు పంపగా.. కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్‌ వీడియోల కేసులో సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. మే 1న విచారణకు రావాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలని సమన్లలో పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. అమిత్ షా కొద్దిరోజుల క్రితం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే, షా ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫేక్‌ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపింది.ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

Spread the love

Related News