ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 20 మందికి పైగా మృతి, పలువురికి గాయాలు

ప్రతిపక్షం, జూన్ 03: ఢిల్లీలోని మాలవీయనగర్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 37 మంది గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగ్నికీలల్లో చిక్కుకున్న పలువురు సిబ్బంది సజీవదహనం కావడంతో ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Spread the love

Related News

Latest News