కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అధికారి

ప్రతిపక్షం, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులైన సంజయ్ జాజు పరిపాలనా అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. గతంలో 2005 నుంచి 2007 వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) కమిషనర్‌గా ఆయన సేవలందించారు.

ఆయన కమిషనర్‌గా ఉన్న సమయంలోనే ఎంసీహెచ్‌ను విస్తరించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)గా రూపుదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. నగర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పరిపాలనా సంస్కరణల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన సంజయ్ జాజు, నగర విస్తరణకు అనుగుణంగా పలు ప్రణాళికలను అమలు చేశారు. ఆయన హయాంలో చేపట్టిన అనేక పరిపాలనా సంస్కరణలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న సంజయ్ జాజు నాయకత్వంలో పాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spread the love

Related News

Latest News