ప్రతిపక్షం, తెలంగాణ: రాష్ట్ర రాజధానిలో 21వ బయో ఆసియా – 2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అగ్రగామిగా ఉంది. కొవిడ్ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. లైఫ్‌సైన్సెస్ రాజధాని మన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో మూడు కొవిడ్ వ్యాక్సిన్‌లు వచ్చాయి. వాటిలో ఒక వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది మన హైదరాబాద్. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫార్మా రంగంలో సవాళ్లను నేను అర్థం చేసుకోగలను. ఇటీవల కొంత మంది ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యా. ఈ రంగానికి బాసటగా నిలుస్తాం.. అని భరోసా ఇచ్చారు.