Trending Now

Kamal Haasan: ఆస్పత్రిలో రజనీకాంత్‌.. త్వరగా కోలుకోవాలని కమల్‌హాసన్‌ పోస్ట్

Kamal Haasan’s post wishes Rajinikanth to get well soon: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యానికి గురి కావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్‌కు వైద్యులు చికిత్స అందించారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. తాజాగా, ఆస్పత్రిలో ఉన్న రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని కమల్‌హాసన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకుసోషల్‌ మీడియాలో కమల్ హాసన్ పోస్ట్‌ చేశారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి. అయితే రజనీకాంత్‌ హృదయ నాళానికి సంబంధించి చికిత్స చేసినట్లు సమాచారం. మరోవైపు రజినీకాంత్‌ ఆస్పత్రిలో చేరారన్న వార్తలు రావడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం వేట్టయాన్‌, కూలీ చిత్రాల్లో రజనీ నటిస్తున్నారు. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న విడుదల కానుంది.

Spread the love

Related News

Latest News