Trending Now

‘ప్రభుత్వం వెంటనే జిల్లాలో చెరువులు, కుంటలు నింపాలి’.. సీపీఎం నేత డిమాండ్

ప్రతిపక్షం, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను నింపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం సిద్దిపేట జిల్లా కమిటి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి అధ్యక్షతన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ.. జిల్లాలో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని, రైతాంగం పెట్టుబడులు పెట్టి దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, పంటలకు చీడపీడలు తగిలి, అనేక రూపాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో నీరు కూడా అందించకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.

వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ప్రాజెక్టుల నుండి నీరు అందించకపోతే ఆ ప్రాజెక్టుల వల్ల ఏమి లాభమని ప్రశ్నించారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతాంగం తీవ్రమైన ఆవేదనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని చెరువులను కుంటలను వెంటనే నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని.. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గోడ్డుబర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో, చోప్పరి రవికుమార్, అమ్ముల బాల నరసయ్య, తిప్పారపు శ్రీనివాస్, బద్దిపడగ కృష్ణారెడ్డి, బండ కింది అరుణ్ కుమార్, దాసరి ప్రశాంత్, జాలిగపు శిరీష, తాడూరి రవీందర్, తాటికొండ రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love