Trending Now

‘ప్రజలకు క్షమాపణ చెప్పాలి’.. కాంగ్రెస్ పై హరీష్ రావు ట్వీట్

ప్రతిపక్షం, తెలంగాణ: హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైందని హరీష్ రావు మండిపడ్డారు.

”నో ఎల్.ఆర్.ఎస్ – నో బీ.ఆర్.ఎస్” అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి.. ఇపుడు ఎల్.ఆర్.ఎస్ కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. గతం లో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్.ఆర్.ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Spread the love

Latest News