ప్రకాశ్‌రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.. మూడో సారి!

ప్రతిపక్షం, జూన్ 24: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బెంగళూరులోని 48వ అదనపు ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ కోర్టు మరోసారి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. బహుళ ఓటరు గుర్తింపు కార్డుల కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వరుసగా మూడోసారి ఈ ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ప్రకాశ్‌రాజ్ పేరుతో ఓటరు నమోదులు ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేశారు. అయితే 2019 ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ఒక్కచోట మాత్రమే ఓటు హక్కు ఉన్నట్లు పేర్కొన్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించగా, కేసు విచారణ కొనసాగుతోంది. విచారణకు పలుమార్లు గైర్హాజరైన నేపథ్యంలో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News