తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ ఎంపీలు మౌనం ఎందుకు?: హరీశ్‌రావు

ప్రతిపక్షం, జూన్ 08: గోదావరి-కావేరి నదుల అనుసంధాన అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. నదుల అనుసంధానం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ప్రముఖ ఇంజినీర్ కేఎల్‌రావు గతంలో సూచించారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అయితే తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం మౌనం వహిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. గోదావరి జలాల వినియోగం, నదుల అనుసంధానం వంటి అంశాల్లో తెలంగాణ హక్కులను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై పోరాడాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News