విద్యార్థులపై దాడి ప్రతి భారతీయ కుటుంబంపైనే దాడి: రాహుల్ గాంధీ

ప్రతిపక్షం, జూలై 21: విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య ప్రతి భారతీయ కుటుంబంపై జరిగిన దాడితో సమానమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పకుండా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని ఆయన విమర్శించారు.

అయితే ఈసారి అలా కుదరదని స్పష్టం చేసిన రాహుల్, విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకునే ప్రతి దేశభక్తి గల భారతీయుడు ప్రధాని నివాసం ముందు నిర్వహించే ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు.

భారతీయ విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని పేర్కొన్న ఆయన, పరీక్షల పారదర్శకత, యువత భవిష్యత్తు, జవాబుదారీతనంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News