ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్ 30: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ సీఈఐఆర్ టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి అప్పగించినట్టు భూంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రవికాంత్ రావు తెలిపారు. వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయ ప్రవీణ్ అనే వ్వక్తి తన వీవో మొబైల్ ఫోనును రెండు నెలల కింద వీరారెడ్డిపల్లి గ్రామంలో పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్‌సైట్ ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్‌ను ఎంటర్ చేసి, బ్లాక్ చేశాడు. వెంటనే ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్‌సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం భూంపల్లి పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు.