Trending Now

దేశంలోనే ఫస్ట్ అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ రోజు పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుండా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు చేసి నిర్మించారు. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి.. దాదాపు రూ. 120 కోట్ల ఖర్చుతో.. హావ్ డా మైదాన్ నుంచి ఎస్ పలనాడె స్టేషన్ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్​ను 45 సెకన్లలో దాటే మెట్రో రైలు కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త సరికొత్త అనుభూతిని అందించనుంది. దీంతో పాటుగా బెంగాల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Spread the love