Trending Now

ఓట్ల లెక్కింపు.. ముందస్తూ చర్యలు

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 27 : వచ్చే నెల నాలుగో తేదీన జరిగే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అన్ని రకాల ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ జిల్లాలోని 3అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కేంద్రంలో సిసి కెమెరాలు అమర్చడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణలు నిర్వహించడం జరిగిందని, ప్రతి రౌండ్ కు డేటా ఎంట్రీ నమోదు చేసి సమాచారం అందిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News