Trending Now

బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..

నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి, మార్చ్ 30: బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిర్మల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన నివాసం నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఒకవైపు అమలులో ఉండంగా మరోవైపు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఐటీ సెల్ కు నోటీసులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలలో కాంగ్రెస్ కు లభిస్తున్నఆదరణను చూసి ఓరువలేక బీజేపీ ఒంటెత్తు పోకడలతో ఈ తరహా దారుణాలకు పాల్పడుతున్నదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయ్యన్న, పోశెట్టికాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొట్టే శేఖర్ ,లింగారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తారక శ్రీవాణి రఘువీర్, నల్లూరి పోశెట్టి , సముందర్ పెల్లి రాజు,శేఖ్ సయిద్ సలీం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love