19న రోహిత్‌కు చివరి వన్డే.. WCలో నో ఛాన్స్?

ప్రతిపక్షం, జూలై 17: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మను చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్‌ ప్రణాళికల్లో రోహిత్‌కు చోటు లేదని, ఈ విషయాన్ని సెలక్టర్లు ఇప్పటికే ఆయనకు తెలియజేసినట్లు సమాచారం. ఈ నెల 19న లార్డ్స్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌ రోహిత్ శర్మకు చివరి వన్డే కావచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది.

రోహిత్‌ ఫామ్‌ ప్రధాన కారణంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు ఆడిన రోహిత్‌ కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. తాజా సిరీస్‌లోనూ 11, 26 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో 2027 ప్రపంచకప్‌ కోసం కొత్త జట్టును సిద్ధం చేసే దిశగా సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే రోహిత్‌ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News