గల్ఫ్ బాధితుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 4 : ఇటీవల ఖతర్ లో మరణించిన గవ్వల రవి కుటుంబానికి గల్ఫ్ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ మంగళవారం రూ.18,500 ల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా సమితి బాధ్యులు మాట్లాడుతూ మృతుడు రవి కుటుంబానికి తాము ఎప్పుడు అండగా ఉంటామని ఎలాంటి సహాయ సహకారాలు ఉన్న ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవుళ్ళ మధు, దేవుళ్ళ లింగం కొండ్ర చిన్నయ్య, గవ్వల పోశెట్టి, మేకరాములు, పుట్టి రాజు, మెరుగు హరీష్ మేకల ముత్యం, ద్యాగల చరణ్, తలకొక్కుల మనోహర్, గవ్వలరాజేశ్వర్, గవ్వనరేష్, గవ్వల మహేష్, కొండ్ర చిన్నయ్య, కుమ్మరి ముత్యం (కువైట్), తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News