Israel Hezbollah War: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 51మంది మృతి

Israel Hezbollah War 51 killed, 223 wounded: ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగించింది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 223 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఫరాస్‌ అబియాద్‌ వెల్లడించారు. ఈ దాడిలో 1500 మంది ఫైటర్లు చేతులు, కంటి చూపు కోల్పోయారని హెజ్‌బొల్లా ప్రతినిధి వెల్లడించారు.

గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా.. 1800 మందికి గాయాలైనట్లు తెలిపారు. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ వరుస దాడులతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇజ్రాయెల్‌ వరుస దాడులకు హెజ్‌బొల్లా కూడా ప్రతిస్పందించింది. టెలీ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో ప్రతిదాడికి దిగింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.

Related News

Latest News