Trending Now

Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్స్ అదుర్స్!

‘Devara’ trailer release.. NTR looks amazing: జూ. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘దేవర’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇక, తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్-జాన్వీ లుక్స్ అదిరిపోయాయి. సైఫ్ అలీఖాన్ విలనిజం అయితే ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అనిరుధ్.. అందించిన బీజీఎం అదిరిపోయిందని, కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోకు మరో భారీ హిట్ పడ్డట్టేనని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News