ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ దర్శకుడు, హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. హీరోయిన్ కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. తెలుగులో రాజూభాయ్, సత్యం, ధన 51 వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు బిగ్ బాస్‌లోనూ ఆయన పాలుపంచుకోవడం గమనార్హం. సూర్యకిరణ్ మృతి పట్ల సినీ అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.