భూంపల్లి వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

ప్రతి పక్షం దుబ్బాక అక్టోబర్ 16: అక్బర్ పేట – భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనికి చేస్తూ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ సెలవుల్లో ఉన్నారని తెలపగా లీవ్ లేటర్ తనికి, లాబ్ టెక్నిషియన్స్ కిరణ్ కుమార్ లీవ్ లేటర్ ఇవ్వకుండా సెలవు తీసుకోవడం, మిగతా సిబ్బంది సైతం ఇష్టానుసారంగా సెలవులు తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. లీవ్ లేటర్ ఇవ్వకుండా గైర్హాజరు అయితే తప్పనిసరిగా జీతం లో కోత విధించాలని హెచ్చరించారు. ఓపి రిజిస్టర్ తనికి చేస్తూ మెడికల్ ఆఫీసర్ ఓపి ఈ నెల 8 తేదీ వరకు రాశారని, 9 వ తేదీ నుండి ఈ రోజు వరకు రాయలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విసిట్ చేసి గైర్హాజరు అయిన , విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎంఅండ్ఎచ్ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.పిఎచ్ సి కి వచ్చిన రోగులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేసుకోవాలని, డాక్టర్ ఇచ్చిన మందులతో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.

Spread the love

Related News

Latest News