శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. స్వల్ప గాయాలు!

ప్రతిపక్షం, నవంబర్ 12, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి ‘కాకా’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా శంషాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆయన ప్రయాణిస్తున్న కారును పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారు కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో కారులో శేఖర్ మాస్టర్ ఉన్నట్లు తెలుస్తుండగా, ఆయనకు స్వల్ప గాయాలైనట్లు వార్తలు వెలువడ్డాయి. షూటింగ్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, శేఖర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది.

Related News

Latest News