రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

ఎఫ్‌సీఐ గోదాముల సమీపంలో ఆర్టీసీ బస్సు – బుల్లెట్ ఢీ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 02: మెదక్ జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన ప్రభుత్వ వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.రామాయంపేట నుంచి మెదక్‌కు వస్తున్న సిద్దిపేటకు చెందిన ఆర్టీసీ బస్సు (నంబర్‌ TS 36 T 0251), ఎఫ్‌సీఐ గోదాముల వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై వస్తున్న సద్దాం హుస్సేన్‌ వాహనాన్ని ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.సమాచారం అందుకున్న మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెదక్ పట్టణానికి చెందిన సద్దాం హుస్సేన్‌ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పట్టణవాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News