రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ తాహెర్ మృతి బాధాకరం

కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రగాఢ సానుభూతి

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 14: మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ తాహెర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహమ్మద్ తాహెర్ మృతి పోలీస్ శాఖకు, ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన కుమారుడు ఖాజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖాజాకు మెరుగైన వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేలా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థించారు.మహమ్మద్ తాహెర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Related News

Latest News