ఆశా వర్కర్లకు రూ.18,000/-లు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలి

ప్రతిపక్షం దుబ్బాక నవంబర్ 12: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆశ వర్కర్లకు ఫిక్స్ డు వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని పీఎఫ్,ఇఎస్ఐ అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి. భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం డిసెంబర్ 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించా 0రు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ ఆశ వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా కోశాధికారి భాగ్యలక్ష్మి,భాలమణి, కవిత,శారద,లత, సంతోషి,చంద్రకళ, స్వరూప,లావణ్య,లక్ష్మీ,రేణుక, అరుణ, నవనీత, పొచవ్వ,తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News