Trending Now

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనఖీ చేసిన జిల్లా ఎస్పీ..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 1: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి, పలు రికార్డులు, పరిసరాలను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకి తక్షణమే న్యాయం జరిగేలా చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని అన్నారు. అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. బాదితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ భయం లేకుండా , న్యాయం జరుగుతుంది అని భావించి ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చేల చూడాలన్నారు. మండలంలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆర్థిక, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం రిసెప్షన్, టెక్నికల్ రూంలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బంది, విధులువారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమండ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News