- కోరుట్ల ప్రభుత్వ ఆసు పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.
- వైద్యులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్.
ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) అక్టోబర్,31: మెట్పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికా రులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం కోరుట్ల పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపా యాలు, వైద్య సిబ్బంది హాజరు, మందుల లభ్యత తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వ హించి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యం కోసం వచ్చే ప్రజల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని సూచించారు. ప్రతి రోగికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరు గైన చికిత్స అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపా యాలను ప్రజలు పూర్తిస్థా యిలో వినియోగించు కునేలా అవగాహన కల్పిం చాలని, ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, రోగులకు అవసరమైన సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధి కారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ, నరసింహారావు, కోరుట్ల, ఆర్డీఓ, జివాకర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.































