ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పల్లెల అభివృద్ధి చేస్తానని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. మంగళవారం సోన్ మండలం సిద్ధలకుంట గ్రామం గురుడి రెడ్డి సంఘం భవన నిర్మాణానికి రూ. 5 లక్షల రూపాయలు, మాదిగ సంఘం భవనానికి 5 లక్షల రూపాయలు, విశ్వబ్రాహ్మణ సంఘం భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సంఘాల భవనాల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు శ్రీహరి రావు ను శాలువ తో సత్కరించారు.