•దేవరకద్ర ఎమ్మెల్యే.జి. మధుసూదన్ రెడ్డికి తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు వినతి
ప్రతిపక్షం, జూలై 02, వనపర్తి ప్రతినిధి: కొత్తకోట మరియు పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది విద్యార్థులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్తకోట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే.జి. మధుసూదన్ రెడ్డికి తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు.రవి యాదవ్ మాట్లాడుతూ…కొత్తకోట పట్టణం మరియు పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ విద్యను అభ్యసించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, రవాణా సమస్యల కారణంగా పేద మరియు గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.కావున కొత్తకోట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి ఏర్పాటు చేయాలని,ఈ కళాశాల ఏర్పాటు వల్ల వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చి, వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని వారు కోరారు.

















