Trending Now

Hockey: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్!

India as the winner of the Asian Champions Trophy: చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకున్న టీమిండియా.. మొత్తం ఐదుసార్లు ట్రోఫీని నెగ్గింది. భారత్‌ 1-0 తేడాతో చైనాపై పోరాడి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. డిఫెండర్‌ జుగ్‌రాజ్‌ సింగ్‌ 51వ నిమిషంలో గోల్ కొట్టి టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 5-2 తేడాతో కొరియాని ఓడించింది. కాగా పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్‌ జట్టు కాంస్యంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News