ప్రతిపక్షం, వెబ్ డెస్క్: WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్‌స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ.. RCB తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో అత్యంత వేగంగా మిలియన్ లైక్స్ పొందిన ఇండియన్ అకౌంట్‌గా RCB నిలిచింది. దీని తర్వాత కోహ్లీ పోస్టు (10 నిమిషాలు) ఉంది.