Trending Now

పోలీసుల తనిఖీలో నగదు సీజ్..

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 10 : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని జిల్లా చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో రూ. 75,000/- నగదును పోలీసులు సీజ్ చేశారు. అక్కన్నపేట గ్రామ శివారులో ఉన్న స్టాటికల్ సర్వేలెన్సు చెక్పోస్ట్ వద్ద అక్కన్నపేట ఎస్ఐ వివేక్, స్టాటికల్ సర్వేలెన్సు సిబ్బందితో కలిసి శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సయ్యద్ సల్మాన్ అతని వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రూ. 75,000/- నగదును పట్టుకున్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేట ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణంలో స్టాటికల్ సర్వేలయన్స్ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని.. నిరంతరం వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. సీజ్ చేసిన డబ్బులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందన్నారు. అక్కడ డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించుకుని డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చని సూచించారు.

Spread the love

Related News