చిన్నారిపై లైంగిక దాడి కేసు.. కరాటే కోచ్‌కు 20 ఏళ్ల జైలు

ప్రతిపక్షం, జూన్ 18: హైదరాబాద్‌లో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కరాటే, జిమ్నాస్టిక్స్ కోచ్‌కు ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. మూడేళ్లన్నర వయసున్న బాలికపై లైంగిక దాడి చేసిన నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.

ఈ కేసులో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఘటనకు పరోక్షంగా కారణమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా అత్యాచారం, పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని, నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Spread the love

Related News

Latest News