ప్రతిపక్షం, జూలై 24: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో టెంపుల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రామిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రామిరెడ్డి ద్విచక్ర వాహనంపై భద్రాచలం నుంచి కూనవరం రోడ్డువైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన సీఆర్పీఎఫ్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా, వెంటనే స్థానికులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
రామిరెడ్డి ఆకస్మిక మృతితో భద్రాచలం దేవస్థాన అధికారులు, ఉద్యోగులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

















