వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

ప్రతిపక్షం, జూలై 01: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం దక్కకపోవడంపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియా లేదా రాజకీయ వ్యాఖ్యల ఒత్తిడిని పట్టించుకోమని స్పష్టం చేశారు. జట్టు అవసరాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే తుది జట్టును ఎంపిక చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకే ఓపెనర్లుగా అవకాశం లభించే సూచనలు ఉండటంతో వైభవ్ అరంగేట్రం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News