ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆటలోనూ భారత్‌దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుల్‌దీప్ యాదవ్ (27), జస్‌ప్రీత్ బుమ్రా (19) ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) సెంచరీలతో రాణించారు. యశస్వి జైస్వాల్ (57), దేవదుత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. పరుగులను నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం ఇండియా ఆధిక్యం 255 పరుగులు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 రన్స్‌కే కుప్పకూలింది.