హనీ‌ రోజ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. బిజినెస్‌మేన్ క్షమాపణలు

ప్రతిపక్షం, జూన్ 30: మలయాళ నటి హనీ రోజ్‌పై చేసిన వ్యాఖ్యల వివాదంలో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల హనీ రోజ్ మనోభావాలు దెబ్బతిన్నట్లయితే చింతిస్తున్నానని, ఎవరినీ అవమానించడం లేదా బాధపెట్టడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

హనీ రోజ్ తనపై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు కూడా బాబీ చెమ్మనూర్ పేర్కొన్నారు.

గతంలో ఓ బహిరంగ కార్యక్రమంలో హనీ రోజ్ రూపురేఖలపై బాబీ చెమ్మనూర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అనంతరం సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ పోస్టులతో తనను వేధించారని ఆరోపిస్తూ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా బాబీ క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News