పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

ప్రతిపక్షం, జూన్ 03: సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా 4వ తేదీన కోయిల్ సాగర్, జూరాల, గూడెందొడ్డి, నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల పురోగతి, నీటి నిల్వ సామర్థ్యం, పనుల వేగం వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

5వ తేదీన సోమశిల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కుమ్మెర పంప్ హౌస్, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.అదే రోజు ఉయ్యాలవాడలో ఇరిగేషన్ సమీకృత కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News