తెలంగాణలో SIR గడువు పెంచాలి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) గడువును మరో 10 రోజులు పొడిగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కోరారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని, అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో చేర్చేందుకు అదనపు సమయం అవసరమని ఆయన తెలిపారు.

ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24తో SIR ప్రక్రియ ముగియనుండగా, గడువు పెంచితే సర్వే మరింత సమగ్రంగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ గడువును ఈ నెల 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News