Trending Now

కేదారినాథ్‌లో అన్నదానం.. కరపత్రం ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 17: మానవ సేవయే.. మాధవ సేవా అన్ని ధానాల కన్నా గొప్ప దానం అన్నదానం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కేదారినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదారినాథ్ లో యాత్రలో ఉండే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం కరపత్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట అంటే సేవా కార్యక్రమాలను అందిపుచ్చుకున్న ప్రాంతం అని దేశంలో చార్ ధామ్ యాత్రలో అమర్ నాథ్, కేదారినాథ్ యాత్రలు ప్రత్యేకమైనవి అని అలాంటి యాత్రకు వెళ్లే భక్తులకు అక్కడ భోజనం పెట్టె అదృష్టం సిద్దిపేట ప్రజలకు, కేదారినాథ్ సేవ సమితి కి కలిగిందన్నారు.

ఇటీవలనే అయోధ్య లో అన్నదానం ఏర్పాటు చేశారు. అదేవిదంగా గతంలో అమర్ నాథ్ వెళ్లే యాత్రికులకు, గత నాలుగు ఏళ్లుగా కేదారినాథ్ వెళ్లే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి సౌకర్యం అంత దూరంలో ఏర్పాటు చేయడం అభినందనియం అని ఈ సందర్భంగా అన్నారు. అమర్ నాథ్ సేవ సమితి, కేదారినాథ్ సేవ సమితి సభ్యలు సామాజిక సేవ ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం కావడం సంతోషకరామన్నారు. వచ్చే నెల 3 వ తేదీన సిద్దిపేట నుండి లారీలో అన్నదాన సామాగ్రి ప్రారంభం అగును. కేదారినాథ్ ఆలయ అతి సమీపంలో ఈసారి మే 10న అన్నదానం ప్రారంభం కానునట్లు చెప్పారు.

Spread the love

Related News

Latest News