పీజీ పరీక్ష ఫలితాలలో కోరుట్ల రామకృష్ణ విద్యార్థుల విజయకేతనం

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 27: శాతవాహన యూనివర్సిటీ, విడుదల చేసిన పీ.జీ, రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో కోరుట్ల రామకృష్ణ పీ.జీ, కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ విభాగంలో 100, శాతం ఉత్తీర్ణతతో పాటు జాల మేఘన 7.52, జిపిఏ, లోకిని గణేష్ 7.39, జిపిఏ, సుమయ్య భాను 7.35, జిపిఏ, సపూర షరీన్ 7.15, జిపిఏ, తోట మాధవి 7.30, జిపిఏ, బబ్బిలి మాధురి 7.05, జీపీఏ, ఎం కామ్ కంప్యూటర్స్ విభాగంలో తయ్యబా ఫిర్దౌస్ 7.11, జీపీఏ , సాజన 6.98 జిపిఏ, శనిగారపు కావ్య 6.94, జిపిఏ, దొనకంటి నవనీత 6.94, జిపిఏ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్ గాడి పెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.

Related News

Latest News