ప్రతిపక్షం, ఆగస్టు 21: తన కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన ఆరోపణలతో తలెత్తిన వివాదంపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై నిన్ననే తన అభిప్రాయాన్ని వెల్లడించానని, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు.
సుష్మిత వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఇవాళ మంత్రి సురేఖను ప్రశ్నించగా.. ‘‘చెప్పాల్సింది నిన్ననే చెప్పా.. మాట్లాడేదేం లేదు’’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనను కలిసి మాట్లాడతానని తెలిపారు.
మరోవైపు తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలపైనా మంత్రి సురేఖ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కొండా కుటుంబం వ్యవహారంపై కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం మరింత ఉత్కంఠగా మారింది.





























