[t4b-ticker]

పట్ట పగలే తాళం వేసిన ఇంట్లో చోరీ

•బంగారు ఆభరణాలు, వెండి, నగదు అపహారణ

వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 18(ప్రతిపక్షం): పట్టపగలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 10.8 గ్రాముల బంగారం, 24 తులాల వెండితో పాటు…రూ. 30వేల నగదును అపహరించిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.మంగళవారం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని స్కాలర్స్ బిఈడీ కళాశాల వద్ద ఉన్న ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన నందిమల్ల శైలజ రేడియంట్ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. అయితే సోమవారం ఉదయం ఆమె ఇంటికి తాళం వేసి విధులకై వెళ్లారు.దీంతో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు విరగొట్టి ఇంట్లో ఉన్న 10.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 24తులాల వెండితో పాటు..రూ. 30వేల నగదు ను అపహరించారు.

కాగా ఇంటి యజమాని నందిమల్ల శైలజ తన ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు విరగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.మంగళవారం ఉదయం బాధితురాలు శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రయ్య, రైటర్ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకొని,చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.విధులకై వెళ్లిన శైలజ ఎవరూ లేని సమయంలో దుండగులు అపహరించడంతో బాధితురాలు బోరున విలపించారు.జిల్లా కేంద్రంలో ఉన్న ఇంటికి తాళాలు వేసిన చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.తాము నిత్యం ఉదయం పూట ఇండ్లకు తాళాలు వేసి విధులకు వెళ్తామని ఆ సమయంలో తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. స్థానిక పోలీసులు ఉదయం పూట కూడా కాలనీలో బీటు నిర్వహించి తమ ఆస్తుల రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News