ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఖరారు చేశారు. ఇప్పటికే 16 ఎంపీ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.