‘కాక్రోచ్ పార్టీ’ ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

ప్రతిపక్షం, జూన్ 17: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తమ పార్టీకి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. నాగ్‌పూర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపే ప్రణాళిక లేదన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రతి సమస్యకు పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం రాజకీయ రంగంలోకి రావాల్సిన అవసరం ఉందా అనే అంశంపై కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో తనపై జరిగిన దాడి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News