ప్రతిపక్షం, ఆగస్టు 27: మహారాష్ట్రలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారంలో భాగంగా ఓ యువకుడు అధికారులతో కుమ్మక్కై ప్రశ్నపత్రాన్ని సంపాదించడం, ఆ తర్వాత అదే ప్రేమికురాలు తనకు దూరం కావడంతో ఆగ్రలవర్ కోసం పేపర్ లీక్.. బ్రేకప్ తర్వాత వెలుగులోకిహానికి గురై పేపర్ లీక్ విషయాన్ని బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువకుడితో పాటు పలువురిని అరెస్టు చేశారు.
వివరాల ప్రకారం.. రాజేంద్ర పాటిల్ అనే వ్యక్తి తన ప్రియురాలు రుతుజా పాటిల్‌కు పరీక్షలో ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన కొందరు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి సహకారంతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ముందుగానే సంపాదించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఆ ప్రశ్నపత్రాన్ని తన ప్రియురాలికి అందించడంతో ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే పరీక్ష పూర్తయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రుతుజా పాటిల్ రాజేంద్రతో ప్రేమ సంబంధాన్ని కొనసాగించకుండా అతడికి దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేంద్ర.. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది, దానిని ఎవరు అందించారు, పరీక్షకు ముందే ఎవరెవరికి చేరింది అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రాజేంద్ర పాటిల్‌తో పాటు రుతుజా పాటిల్ తండ్రి, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన నలుగురు అధికారులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ప్రేమ వ్యవహారం కారణంగా ప్రారంభమైన ఈ ఘటన చివరకు ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసుగా మారడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టే అధికారులు నిబంధనలను ఉల్లంఘించి ప్రశ్నపత్రం బయటకు చేరేలా చేశారా? ఇందులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





























