ప్రతిపక్షం, ఆగస్టు 27: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని మల్లికా గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు స్వాగతం పలికారు. అనంతరం వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకలో ఎంపీ డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది.





























