[t4b-ticker]

మునుగోడు నియోజకవర్గ వార్డు మెంబర్ల ఫోరం ఇన్చార్జిగా బొమ్మరబోయిన కవిత

*అపాయింట్ లెటర్ అందజేసిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి.

ప్రతి పక్షం మునుగోడు ఆగస్టు 27: మునుగోడు నియోజకవర్గ వార్డ్ మెంబర్ల ఫోరం ఇన్చార్జిగా కస్తాల గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు బొమ్మరబోయిన కవితా సైదులు ఎంపికయ్యారు.

గురువారం ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోత అపాయింట్ లెటర్ అందజేశారు.
ఈ సందర్భంగా కవిత తన ఎన్నిక పట్ల స్పందిస్తూ ప్రతినిత్యం గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వార్డ్ మెంబర్ల సమస్యలపై అందుబాటులో ఉంటానని తెలిపారు. అదేవిధంగా తన పట్ల విశ్వాసంతో నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం కల్పించిన ఫోరం రాష్ట్ర అధ్యక్షులకు, తన ఎన్నికకు సహకరించిన వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Spread the love

Related News

Latest News