ఇండియా కూటమి మీటింగ్.. కీలక నిర్ణయాలు

ప్రతిపక్షం, జూన్ 08: ఇండియా (INDIA) కూటమి సమావేశంలో 25 ప్రతిపక్ష పార్టీలు ఐదు ప్రధాన అంశాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు.

SIR ప్రక్రియ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ, ఈ అంశంపై త్వరలో భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI) లేఖ రాయనున్నట్లు ఖర్గే తెలిపారు.

అలాగే NEET, CBSE పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కూటమి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో కేంద్రం బాధ్యత వహించాలని పేర్కొంది.

ప్రతిపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇండియా కూటమి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశం ఆగస్టు 8న జరగనున్నట్లు ఖర్గే వెల్లడించారు.

రానున్న ఎన్నికలు, ధరల పెరుగుదల, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎన్నికల సంస్కరణలు తదితర అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు కూటమి నాయకులు చర్చించినట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News