ప్రతిపక్షం, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు వంటివి ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌ను కోరారు.