Trending Now

అక్రమంగా పేలుళ్లు.. వ్యక్తి అరెస్ట్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ముందస్తు అనుమతులు లేకుండా పేలుళ్లకు పాలుపడుతన్న వ్యక్తిని SOT సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్, జీనోమ్ వ్యాలీ పోలీసులు సంయుక్తంగా జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి లో గల ఐకేపీ పార్క్ లో ఎటువంటి అనుమతులు లేకుండా, అక్రమంగా పేలుళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌ రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి జెలటిన్ స్టిక్స్ & డిటోనేటర్లు – 06, కంప్రెసర్ వాహనం: 01 (AP 16 TC 2936), స్విచ్ బాక్స్ – 01 లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమాని ఓర్సు సైదులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love

Related News